
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించి సొంత ప్రేక్షకుల్ని మురిపించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 49–32 స్కోరుతో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది.
కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16 పాయింట్లు), ఓంకార్ (10) రాణించారు. అంతకుముందు జరిగిన తొలిపోరులో దబంగ్ ఢిల్లీ 39–33తో యు ముంబాపై నెగ్గింది.