నేటి నుంచి పింఛన్ల పంపిణీ
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లోని 3,09,000 మంది లబ్ధిదారులకు రూ.131.62 కోట్ల నగదును పంపిణీ చేయనున్నారు. నగదును ఇప్పటికే కార్యదర్శులకు అందజేశారు.
జిల్లా విద్యాశాఖలో బదిలీలు
నెల్లూరు (టౌన్): జిల్లా విద్యాశాఖలో పలువురు డిప్యూటీ డీఈఓలు, ఏడీ, సూపరింటెండెంట్ బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న కె.ప్రసన్నలక్ష్మిని నెల్లూరు విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా, ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న టి.విజయకుమార్‌ను కడప ఆర్జేడీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆత్మకూరు డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న గోపాల్, కావలి డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న పి.రఘురామయ్యను విజయవాడ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. నెల్లూరులో ఎయిడెడ్ సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓవీఎస్ అనిల్‌కుమార్‌ను డిప్యుటేషన్‌పై విజయవాడ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు.
విద్యుత్ భవన్ వద్ద మీటర్ రీడర్ల నిరసన
నెల్లూరు (వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్‌కు వేతనాలు చెల్లించాలంటూ శుక్రవారం విద్యుత్ భవన్ వద్ద యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) నిరసన చేపట్టింది. అనంతరం ఎస్‌ఈ విజయన్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్‌కిశోర్ మాట్లాడుతూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఉత్తర్వుల మేరకు మీటర్ రీడర్స్‌కు సెప్టెంబర్ నెల నుంచి వేతనాలు ఎస్కో పద్ధతిలో బ్యాంకు ఖాతాలకు నేరుగా వేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రీడర్లను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో 20 ఏళ్లుగా మీటర్ రీడర్లుగా పనిచేస్తున్న వారందరికీ ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, హజరత్ వలీ, బాలకృష్ణ, వెంకటసుబ్బయ్య, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment