మత్స్యకార భరోసా
మత్స్యకారులను టీడీపీ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ పరిహారం అరకొర మందికి అదీ తొలి రెండేళ్లు రూ. 2 వేలు, మరో రెండేళ్లు రూ.4 వేల వంతున సాయం చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పరిహారాన్ని రూ.10 వేలకు పెంచడంతోపాటు గత టీడీపీ హయాంలో కంటే మిన్నగా అత్యధిక మందికి అందజేసి ఆదుకుంది. ఎన్నికల ముందు వేట నిషేధ పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అయినా ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని ఎదురు చూసిన మత్స్యకారులకు సంబంధిత శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతానికి పరిహారం ఇవ్వలేమంటూ చేసిన ప్రకటన మింగుడు పడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment