● వాయుగుండంగా బలహీనపడిన తుఫాన్
నెల్లూరు (అర్బన్): నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తన దిశ మార్చుకుంది. తొలుత ఫెంగల్ తుఫాన్‌గా మారినట్లే మారి బలహీనపడి వాయుగుండంగా గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర తమిళనాడు కదులుతోంది. కరైకల్‌కు దగ్గరగా మహాబలిపురం, పుదుచ్చేరికి మధ్య శనివారం తీరందాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో జిల్లా తీరంలో ఇప్పటికే సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతంలో ఈదురు గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాపై ప్రభావం ఉండొచ్చని అధికారులు ప్రకటించారు. మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
జిల్లాకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు
నెల్లూరు(అర్బన్): పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను జిల్లాలోని వివిధ విభాగాల్లో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బి.మహేశ్వరరెడ్డిని నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ అధికారిగా నియమించింది. బి.చంద్రలీను నెల్లూరు కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఎ.మురళిని నెల్లూరు టీజీపీ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment