నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను శనివారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారోత్సవాల్లో భాగంగా రోజూ విద్యార్థులు, వినియోగదారులకు, సిబ్బందికి భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులకు డివిజన్ స్థాయిలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, సెమినార్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కరపత్రాల పంపిణీ, రూరల్ ప్రాంతాల్లో ఎన్జీఓ, జనవిజ్ఞాన వేదికతో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment