ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా ఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్, మండల వ్యవసాయ శాఖ అఽధికారులు జిల్లాలోని వివిధ మండలాల్లో ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. పొదలకూరులో పలు షాపులు, నెల్లూరులోని సాయిలక్ష్మి ఫర్టిలైజర్, శ్రీ కామాక్షి రైతు డిపో, శ్రీ వెంకట పద్మావతి రైతు డిపో, దగదర్తి మండలం వెలుపోడు గ్రామంలోని శ్రీ కామాక్షితాయి ఫర్టిలైజర్స్ దుకాణాల్లో రికార్డులను, స్టాక్‌ను పరిశీలించారు. స్టాక్‌లో వ్యత్యాసాలు, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.58,54,290 విలువైన 324.96 మెట్రిక్ టన్నుల ఎరువులు, రూ.9,76,120 విలువైన 851 లీటర్ల పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు దుకాణాలపై 6ఏ కింద కేసులు నమోదు చేసి, రెండు షాపుల్లో విక్రయాలను నిలుపుదల చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు కె.నరసింహారావు, ఎ.శ్రీహరిరావు, డీసీటీఓ విష్ణురావు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రూ.68,30,410 విలువైన
సరుకుల స్వాధీనం
నాలుగు దుకాణాలపై 6ఏ కేసుల నమోదు
Comments
Please login to add a commentAdd a comment