● పోలీసులకు మహిళ ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి నన్ను వేధించడమే కాకుండా కారుతో ఢీకొట్టబోయాడు. నా ప్రాణాలకు హాని ఉంది రక్షణ కల్పించాలని ఓ మహిళ శుక్రవారం నెల్లూరులోని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సీఏఎం కాంపౌండ్‌లో ఓ మహిళ ఒంటరిగా జీవిస్తోంది. అమృతరావు తన కుటుంబంతో కలిసి అదే కాంపౌండ్‌లో కొంతకాలంగా జీవిస్తున్నాడు. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అతను ఆమెను వేధిస్తూ అసభ్యకర పదజాలంతో దూషించసాగాడు. దీంతో మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతడిని మందలించి పంపారు. అయినా ప్రవర్తనలో మార్పురాలేదు. ఈనెల 12వ తేదీన అతను ఆమెను కారుతో ఢీకొట్టబోయాడు. మహిళ తప్పించుకుని పరుగులు తీయడంతో అసభ్యకరంగా దూషించాడు. అతడి నుంచి తన ప్రాణాలకు హాని ఉందని రక్షణ కల్పించాలని బాధితరాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
భూముల
ధరలపై ఆరా
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను త్వరలో పెంచనున్న నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ధరలను శుక్రవారం జిల్లా రిజిస్ట్రార్ హరివర్మ ఆరాతీశారు. నగరంలోని ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తుత ధరలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల విలువ పెంపునకు సంబంధించిన కమిటీకి జేసీ చైర్మన్‌గా ఉంటారన్నారు. ఆయన ఆదేశాలతో ప్రస్తుత ధరల వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. పూర్తి నివేదికను జేసీకి సమర్పిస్తామన్నారు. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment