పెంచలకోనలో వైభవంగా పూజలు
రాపూరు: మండలంలోని పెంచలకోనలో శుక్రవారం హనుమద్వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి అభిముఖంగా వెలసిన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రత్యేక అభిషేకం, పూలంగిసేవ చేశారు. 8 గంటలకు స్వామి ఉత్సవమూర్తిని తిరుచ్చిపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వెయ్యి నామాలతో ఆకు పూజ చేపట్టారు. స్వామి మాలధారణ భక్తులు దీక్ష విరమించారు. ఉభయకర్తలుగా మధుసూదనరావు వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి, అర్చకులు శశిస్వామి, నాగరాజస్వామి, వినోద్‌స్వామి, సూర్యస్వామి, మల్లికార్జునస్వామి, ప్రసాద్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment