సరుకులు తెచ్చేందుకు వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కోవూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని రామన్నపాళెం గేటు దగ్గర శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. టపాతోపు ప్రాంతానికి చెందిన పుల్లా కృష్ణకిశోర్ (38) సరుకులు తెచ్చేందుకు స్కూటీపై నెల్లూరుకు బయలుదేరాడు. రామన్నపాళెం గేటు వద్దకు వచ్చేసరికి స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడగా కిశోర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment