జొన్నవాడలో దర్శన వేళల్లో మార్పు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ధనుర్మాసం సందర్భంగా జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశామని ఆలయ ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం మాత్రం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటలవరకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు.
● ఆలయంలో శుక్రవారం కృత్తికా దీపోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు ఆలయ గోపురంపై అఖండ దీపాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment