బాల్యంలోనే బందీలుగా..
కోవూరు: బాల్య వివాహాలు చిన్నారులను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలనే వీరి ఆశయాలను కొందరు తల్లిదండ్రులు చిదిమేస్తున్నారు. చిరు ప్రాయంలోనే పెళ్లి చేయడంతో అనారోగ్యానికి గురవుతూ మగ్గిపోతున్నారు.
నిబంధనలు బేఖాతర్
వాస్తవానికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలనేది నిబంధన. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు చిన్న వయస్సులోనే వివాహం చేసి బరువు దించేసుకోవాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే బాల్య వివాహాలపై మొగ్గుచూపుతున్నారు. ఇలా వ్యవహరించడం తగదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, ప్రయోజనం ఉండటంలేదు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు.. ప్రేమ పెళ్లిళ్లనే భయంతో మరికొందరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.
సమాచారమూ కరువే..
బాల్య వివాహాన్ని ఇటీవల అధికారులు అడ్డుకున్నారు. దీంతో యుక్త వయస్సు వచ్చేంత వరకు బాలికను ప్రభుత్వ వసతి గృహంలో ఉండేలా తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక హామీ పొందారు. అయితే కొన్ని సందర్భాల్లో బాల్య వివాహాలపై అధికారులకు ఎలాంటి సమాచారం అందడంలేదు.
చురుకై న పాత్ర
బాల్య వివాహాలు చేయడం తప్పంటూ ఐసీడీఎస్ అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన గ్రామ పోలీసులు వీటిని నిరోధించడంలో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. సంగం మండలం కొలగట్ల, దువ్వూరులో ఇటీవల జరుగుతున్న బాల్య వివాహాన్ని శిశు సంక్షేమ శాఖ అధికారులు అడ్డుకున్నారు.
బాల్య వివాహాలతో సంభవించే అనర్థాలపై సంగం మండలంలో అవగాహన (ఫైల్)
అధికారులు అడ్డుకున్నవి
పుస్తకాలు పట్టాల్సిన చిట్టి తల్లులు బాల్యంలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆ పుత్తడి బొమ్మల మెడలో పుస్తెలతాడు ఉరితాడులా మారుతోంది. తెలిసీ తెలియని వయస్సులో పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని వారిపై సంసార బాధ్యతలు గుదిబండలా మారుతున్నాయి. పేదరికం ఓ వైపు.. ఆడపిల్ల భారం తీరుతుందనే ఉద్దేశంతో సంసారం అనే సాగరంలోకి నెట్టేస్తున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు, పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. చిరుప్రాయంలోనే గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడి జీవితాలు కోల్పోతున్నారు.
గ్రామాల్లో ఆగని బాల్య వివాహాలు
ఆర్థిక ఇబ్బందులతో పాటు
ప్రేమ పెళ్లిళ్ల భయం
అధికారుల హెచ్చరికలు పెడచెవిన
Comments
Please login to add a commentAdd a comment