జోస్ ఆలుక్కాస్ షోరూమ్ ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నగరంలోని మాగుంట లేఅవుట్లో జోస్ ఆలుక్కాస్ 60వ ఆభరణాల షోరూమ్‌ను ప్రముఖ నటి పాయల్ రాజ్‌పుత్ శనివారం ప్రారంభించారు. నెల్లూరు రూరల్, కోవూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జోస్ ఆలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కాస్, పాల్ ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడారు. షోరూమ్ ప్రారంభ సందర్భంగా రూ.60 వేల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాల కొనుగోలుపై బంగారు నాణేన్ని అందిస్తున్నామని, ఈ ఆఫర్ ఈ నెల 18 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. వజ్రాభరణాల కొనుగోలుపై 20 శాతం, ప్లాటినమ్ ఆభరణాలపై ఏడు శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. వెండి నగలపై తరుగు చార్జీలుండవని, ప్రతి కొనుగోలుతో ఒక ప్రత్యేక బహుమతిని అందిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment