జిల్లా అభివృద్ధికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి ప్రణాళిక

Published Sun, Dec 15 2024 12:45 AM | Last Updated on Sun, Dec 15 2024 12:45 AM

-

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో 2029 నాటికి 15 శాతం వృద్ధి రేటే లక్ష్యంగా ప్రస్తుత జీడీపీ రూ.61,664 కోట్ల నుంచి రూ.1,31,180 కోట్లకు చేరుకునేందుకు అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని కలెక్టర్‌ ఆనంద్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర విజన్‌ – 2047లో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను విడుదల చేశామని చెప్పారు.

● రూ.3,700 కోట్ల అంచనాలతో నాలుగు బెర్తుల డీప్‌ – సీ పోర్టుగా రామాయపట్నం పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు.

● జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.

● వ్యవసాయంలో 73,116 హెక్టార్ల సాగు చేయదగిన భూమిని ఐదేళ్లలో సాగులోకి తేవడం, పప్పు ధాన్యాల విస్తీర్ణాన్ని 12,740 హెక్టార్ల నుంచి 22,499 హెక్టార్లకు పెంచడమే లక్ష్యమన్నారు.

● మైక్రో ఇరిగేషన్‌ ద్వారా 10,395 హెక్టార్ల నుంచి 18,178 హెక్టార్లకు విస్తరించడం, ప్రతి పంటలో వార్షికంగా 15 శాతం వృద్ధి సాధించడం, ఈ ● మార్కెట్లను అభివృద్ధి చేసి రిటైల్‌ షాపులు, గోదాములు, వెజిటబుల్‌ మార్కెట్లు నెలకొల్పడమే లక్ష్యమని చెప్పారు.

● పరిశ్రమలకు సంబంధించిన మెగా, మైక్రో, చిన్న సంస్థల సంఖ్యను 11,992 నుంచి 24,004కు పెంచడం.. పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ బ్యాంకులను అభివృద్ధి చేయడం.. గార్మెంట్‌, చెక్క పరికరాలు వంటి క్లస్టర్లను ప్రోత్సహించనున్నామని పేర్కొన్నారు.

● అన్ని పర్యాటక ప్రాంతాలను డిజిటల్‌ రిపాజిటరీలుగా అభివృద్ధి చేయడం.. సర్వేపల్లి చెరువు, మైపాడు బీచ్‌లలో వాటర్‌ స్పోర్ట్స్‌ను ప్రారంభించనున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement