చార్జీలతో బాదుతున్న ప్రభుత్వం
● విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, దానికి విరుద్ధంగా ఆర్నెల్లోపే రూ.18 వేల కోట్ల భారాన్ని మోపి ప్రజలను మోసం చేసిందని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆరోపించారు. నగరంలోని రామ్మూర్తినగర్ సబ్‌స్టేషన్ వద్ద నిరసనను శనివారం చేపట్టారు. తొలుత కిసాన్‌నగర్ సబ్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కరెంట్ బిల్లులను దహనం చేశారు. సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు మస్తాన్‌బీ, నగర కమిటీ సభ్యులు చిరంజీవి, నరసింహా, ఏమేలు, చెంగయ్య, వేణు, రవూఫ్, అంకయ్య, అశోక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment