నెల్లూరు (పొగతోట): బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్న సీ్త్ర నిధి రుణాలను స్వయం సహాయక గ్రూపు మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి పేర్కొన్నారు. విజయవాడ నుంచి సెర్ఫ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ను శనివారం నిర్వహించారు. అనంతరం జిల్లా సమాఖ్య సభ్యులతో సమావేశమైన పీడీ మాట్లాడారు. రుణాలను సక్రమంగా చెల్లించాలని కోరారు. వీరి ర్యాంకుల ఆధారంగా స్వయం సహాయక గ్రూపు మహిళలకు బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి రుణాలను మంజూరు చేయనున్నారని వివరించారు. సీ్త్ర నిధి ఏజీఎం కామాక్షయ్య తదితరులు పాల్గొన్నారు.
వివాహిత అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): వివాహిత అదృశ్యమైన ఘటనపై నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన క్రాంతికుమార్, హారిక దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో ఇంటి నుంచి శుక్రవారం ఆమె అదృశమయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు .
Comments
Please login to add a commentAdd a comment