కూటమి ప్రభుత్వం కూతలే..
ఎరువుల భారం మోయలేము
నేను 5 ఎకరాల్లో పసుపు, వరి సాగు చేశాను. ఎరువుల కోసం దుకాణాలకు వెళితే గతేడాదికి ఇప్పటికీ రూ.150 వరకు ఽఅధికంగా ధరలు పెరిగాయి. ధరలు పెరిగినట్లుగా పంట ఉత్పత్తుల ధరలు పెరగడం లేదు. వచ్చే సీజన్‌లో పంటలు వేయాలంటే ఆలోచించాల్సి పరిస్థితి నెలకొంది. పంటలు సాగు చేయాలంటే భయమేస్తోంది.
– సిద్దు రామిరెడ్డి, రైతు,
కొత్తపాళెం, ఉదయగిరి
కూటమి ప్రభుత్వం కర్షకుల పాలిట శాపంగా దాపురించింది. ఎరువుల కొరత లేదు.. సబ్సిడీల తగ్గింపు లేదు. కానీ ఈ రబీ సీజన్‌లో వ్యాపారులు ఎరువుల ధరలను పెంచి రైతుల వెన్ను విరుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సమృద్ధిగా ఎరువులను అందించేందుకు ముందస్తు ప్రణాళికతోనే సిద్ధం చేస్తూ వచ్చింది. రైతులకు రవాణా భారం కూడా లేకుండా నేరుగా గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. మరో వైపు డీసీఎంఎస్ ద్వారా విక్రయాలు చేసింది. ఫలితంగా ఎక్కడా ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలు, సొసైటీల ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేసింది. దీంతో వ్యాపారులు కొరత సృష్టించి ధరలు పెంచి దోచుకుంటున్నారు.
ఎరువులు పాతధర (రూ) కొత్త ధర (రూ)
28.28.0 1,680 1,800
14.35.14 1,680 1,800
20.20.0.13 1,100 1,300
10.26.26 1,370 1,470
16.20.0.13 1,100 1,250
24.24.0.08 1,700 1,800
డీఎపీ 1,350 1,450
ఎరువుల ధరలు తగ్గించాలి
ప్రభుత్వం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించి రైతులపై భారం తొలగించాలి. ఎన్నికల ముందు రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు ధరలు పెంచడం న్యాయంగా లేదు. రైతులు పంట వేయడం మానేస్తే ఆహార సంక్షోభం వస్తుంది. పెంచిన ధరలు తగ్గించి, రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర పెంచాలి. – కాకు వెంకటయ్య,
జిల్లా రైతు సంఘం నేత
● రైతులపై ఎరువుల
ధరాభారం రూ.5 కోట్ల పైమాటే
● రబీ సీజన్‌లో కృత్రిమ
కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్
● బస్తాకు రూ.100 నుంచి
రూ.150 వరకు పెంపు
● అదేం లేదంటూ వ్యవసాయశాఖ బుకాయింపు
● వ్యాపారుల కొమ్ముకాస్తున్న
వ్యవసాయశాఖ
● అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు
విజిలెన్స్ దాడుల్లో బట్టబయలు
● పలువురిపై 6ఏ కేసుల నమోదు
ఉదయగిరి: ఆరుగాలం కష్టపడి పంట పండించే కర్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో రబీ సీజన్‌లో వరి సాగు జరుగుతోంది. అధిక వర్షాలతో ఈ ఏడాది రబీ సీజన్‌లో నాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికీ దాదాపు 50– 60 శాతం కూడా నాట్లు పూర్తి కాలేదు. సాగు ప్రారంభంలోనే వ్యాపారులు ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు పెంచి దోచుకుంటున్నారు. సాగు చేసే విస్తీర్ణానికి సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నా.. రైతుల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం నిర్వహించిన దాడుల్లో కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాల విషయం బయపడడంతో వారిపై కేసులు కూడా నమోదు చేయడం చూస్తే.. వ్యవసాయశాఖాధికారులు ఎక్కడా ధరలు పెరగలేదు.. పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఉత్తుత్తి ప్రకటనలు చేస్తూ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారని స్పష్టమవుతోంది.
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతిగా నిలిచారు. సీజన్‌కు ముందు సాగుకు విస్తీర్ణానికి సరిపడా ఎరువులను సిద్ధం చేస్తూ వచ్చారు. ఆర్బీకేలు, సొసైటీల ద్వారా నాణ్యమైన ఎరువులను ఎమ్మార్పీ ధరలకే సరఫరా చేశారు. ఎప్పుడు ఎరువుల కొరత తలెత్తలేదు. మార్కెట్లో ఎరువుల వ్యాపారులపై నిఘా పెట్టి నకిలీ ఎరువులు అమ్మకుండా ధరలు పెంచకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. గత ఐదేళ్లూ ఎప్పుడూ ఎరువుల బ్లాక్ మార్కెట్లో రైతులు కొనే పరిస్థితి రాలేదు.
రబీలో రూ.5 కోట్ల భారం
జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేస్తున్నారు. అత్యధికంగా వరి, మినుము, శనగ, మిరప తదితర పంటలు సాగు జరుగుతోంది. రబీ సీజన్‌లో వివిధ రకాల 1,74,831.8 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారుల అంచనా. అయితే ప్రస్తుతానికి 52,804 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ వెబ్‌సైట్‌లో ఉంది. అయితే ధరలు పెరగడానికి కారణం తాము కాదని, ప్రభుత్వమే పెంచిందని వ్యాపారులు చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచగా, డీలర్లు వ్యాపారులు రూ.50 వరకు పెంచి దోచుకుంటున్నారు. ప్రధానంగా డిమాండ్ ఉన్న యూరియా, 20.20.0.13, 28.28.0, 14.35.14 ఎరువులపై అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో పాటు వివిధ కంపెనీల పురుగు మందులు కూడా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా రైతుల నెత్తిన ఈ రబీ సీజన్‌లోనే సుమారు రూ.5 కోట్లకు పైగా భారం పడుతోంది.
పెరిగిన ఎరువుల ధరలు (బస్తాల్లో)
ఎరువు అవసరం (మె.ట.)
తాము అధికారంలోకి వస్తే రైతులకు అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ ఎన్నెన్నో హామీలు గుప్పించిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే అన్నదాతలను నిలువునా దగాకు గురి చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని పెంచి ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకపోగా, ప్రభుత్వమే చెల్లించాల్సిన బీమాను రైతులే కట్టుకోవాలంటూ తప్పుకుంది. మరో వైపు ఆర్బీకేలు, సొసైటీల్లో ఎరువుల విక్రయాలను నిలిపివేసింది. ఇదే అదనుగా వ్యాపారులు మార్కెట్లో ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు వికయ్రిస్తున్నారు. ఒక్కొక్క ఎరువుల బస్తాపై రకాన్ని బట్టి రూ.100 నుంచి రూ.150 వరకు ధరలు పెంచి దోచుకుంటున్నారు. చేవ చచ్చిన వ్యవసాయశాఖాధికారులు, అసమర్థ పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లాలో వ్యాపారులు, డీలర్లు ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మా సిబ్బంది నిరంతర నిఘాలో ఉన్నారు. ఎక్కడైనా ఆ పరిస్థితి ఉంటే నా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ సీజన్‌లో ఎరువుల కొరత లేదు. అవసరమైన మేరకు స్టాక్ రైతులకు అందుబాటులో ఉంచాం.
– సత్యవాణి, జేడీ, వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment