జాతీయ లోక్ అదాలత్‌లో 28,166 కేసుల పరిష్కారం
నెల్లూరు (లీగల్): ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 28,166 కేసులు పరిష్కరించి రూ.1,84,23,894 పరిహారంగా అందజేశారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోర్టుకు సంబంధించి 7 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా న్యాయమూర్తులు వెంకట నాగపవన్, కరుణకుమార్, భఽరధ్వాజ, భాస్కర్‌రావు, దేవిక, లావణ్య, సుయోధన్ వ్యవహరించి 13,235 కేసులను పరిష్కరించారు. గూడూరులో 54, కోవూరు 3,602, కావలి 2,734, వెంకటగిరి 1,549, కోట 3,534, నాయుడుపేట 1,631, సూళ్లూరుపేట 686, ఆత్మకూరు 1,126, ఉదయగిరి 15 కేసుల వంతు పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంక్, పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
రేపు జిల్లా స్థాయి జూడో క్రీడాకారుల ఎంపికలు
కావలి: జిల్లా స్థాయి జూడో పోటీలకు సంబంధించి క్రీడాకారుల ఎంపికలు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు కావలిలోని మద్దూరుపాడులో ఉన్న డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతాయని జిల్లా జూడో అడ్‌హాక్ కమిటీ అధ్యక్షుడు మురళి ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులని, సెలెక్ట్ అయిన వారిని రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. సెలక్షన్స్‌కు హాజరయ్యే క్రీడాకారులు పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. వివరాలకు టి. సురేష్‌ను 8919036160లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment