శ్రీవారి దర్శనానికి వెళ్తున్న లక్ష్మణరెడ్డి
కదిరి టౌన్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా లోకాయుక్త జడ్జి లక్ష్మణ్‌రెడ్డి దంపతులు శనివారం ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఉత్తర రాజగోపురం గుండా వెళ్లి శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభునికి పూజలు చేశారు. ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, ఈఓ శ్రీనివాసరెడ్డి వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉమ్మడి జిల్లాపై చలి పంజా
● మడకశిరలో 11.5 డిగ్రీలు,
కుందుర్పిలో 13.1 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఉదయం గజగజ వణికేలా చలితీవ్రత పెరిగింది. ఈ నెల 14న కనిష్ట ఉష్ణోగ్రలతో చలిగింతలు మొదలు కాగా... మళ్లీ వారం రోజుల పాటు కొంత స్థిరంగా నమోదయ్యాయి. అయితే శనివారం ఉదయం ఈ సీజన్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఉష్ణోగ్రతలు 11.5 డిగ్రీలకు పడిపోగా... అనంతపురం జిల్లా కుందుర్పిలో 13.1 డిగ్రీల కనిష్టం నమోదైంది. నల్లమాడ 12.7 డిగ్రీలు, రొద్దం 12.8, గాండ్లపెంట 12.9, కనగానపల్లి 13.2, పరిగి, తనకల్లు 13.3, కొత్తచెరువు 13.4, గుడిబండ, రొళ్ల 13.5, లేపాక్షి, శెట్టూరు 13.6, సోమందేపల్లి 13.8, హిందూపురం 13.9 డిగ్రీల మేర కనిష్టం నమోదయ్యాయి. అలాగే విడపనకల్లు, పుట్లూరు, అనంతపురం, అమడగూరు, తలుపుల, అమరాపురం, అగళి, గోరంట్ల తదితర మండలాల్లో కూడా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. మొత్తం మీద మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి, రాయదుర్గం, అనంతపురం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో చలితీవ్రత కాస్త అధికంగా ఉంది. వేకువజామున పొగమంచు కప్పేస్తుండగా జాతీయ రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment