మహోన్నత త్యాగానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

మహోన్నత త్యాగానికి ప్రతీక

Published Mon, Jun 17 2024 12:48 AM | Last Updated on Mon, Jun 17 2024 12:48 AM

మహోన్

ఇబ్రహీం గొప్ప ప్రవక్తల్లో ఒకరు. ఆయనకు ‘ఖలీలుల్లాహ్‌’ అనే బిరుదు ఉంది. అంటే ‘అల్లాహ్‌ మిత్రుడు’ అని అర్థం. దైవ ప్రసన్నం కోసం చేసే కార్యాన్ని మించింది లేదని తన జీవితం ద్వారా ఆయన నిరూపించారు. కలలో ఏదైనా కన్పిస్తే అది ఆ దేవుని ఆ/్ఞ అని ఆయన భావించి వెంటనే ఆచరించారు. ఇబ్రహీంతో పాటు ఆయన కుమారుడు ఇస్మాయిల్‌ల మహోన్నత త్యాగనిరతిని స్మరించుకోవడం కోసం ఈ బక్రీదు పండుగను జరుపుకుంటాం. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్‌యాత్ర చేసి ముక్తిని పొందాలి.

–సయ్యద్‌ ఉబేదుల్లా హుసేని,

హజరత్‌ సయ్యద్‌ జహీరుద్దీన్‌ బాబా దర్గా పీఠాధిపతి, కుటాగుళ్ల, కదిరి

ప్రవక్తలను ఆదర్శంగా తీసుకోవాలి

ప్రవక్తల త్యాగానికి ప్రతీక బక్రీద్‌. ఆనాడు వారు ఆచరిస్తే నేడు పండుగలా ముస్లింలు జరుపుకొంటున్నారు. ప్రవక్తల జీవితాలు, వారు అనుసరించిన విధానాలను తీసుకొని అనుసరించాలి. చెడుమార్గాలకు దూరంగా మంచి, శాంతి మార్గాల్లో నడవాలి. సేవా గుణం కలిగి ఉండాలి. పండుగ తరువాత కూడా ఇదే స్ఫూర్తితో మెలగాలి.

– జాకీర్‌ ముక్తాసాబ్‌, ముత్తవల్లి,

పుట్టపర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
మహోన్నత త్యాగానికి ప్రతీక 
1
1/1

మహోన్నత త్యాగానికి ప్రతీక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement