గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడి మృతి
పరిగి:మండల కేంద్రంలోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్న శివకుమార్(29) గురువారం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఆయన పరిగిలోని ఇండియన్ ఎక్స్‌పోర్టు డిజైన్స్ గార్మెంట్స్ వస్త్ర పరిశ్రమలో దుస్తులను ఇసీ్త్ర చేసే విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం విధులకు హాజరైన శివకుమార్ వస్త్రాలను ఇసీ్త్ర చేస్తున్న సమయంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే శివకుమార్ మృతి చెందాడంటూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రిలో శివకుమార్ మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఏఐటీయూసీ, జైభీం భారత్, ఎంఎస్ఎఫ్ నేతలు వినోద్‌కుమార్, ఊటుకూరు నాగరాజు, రవి మాట్లాడారు. మృతుడి కుటుంబసభ్యులకు రూ.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment