అతివదే నిర్ణయాధికారం
ప్రశాంతి నిలయం: నిర్ణయాధికారం అతివ చేతుల్లోకి వెళ్లింది. పాలకులను ఎన్నుకునే ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉండగా..పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నది పడతుల విజ్ఞతపై ఆధారపడి ఉంది. సోమవారం జిల్లా ఓటరు తుది జాబితాను కలెక్టర్ టీఎస్ చేతన్ విడుదల చేశారు. ఓటరు జాబితా పరిశీలిస్తే జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,12,331 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,01,135 మంది, సీ్త్రలు 7,09,818 మంది ఉన్నారు, ఇక సర్వీస్ ఓటర్లు 1,314 మంది ఉండగా, ఇందులో 1,281 మంది పురుషులు, 33 మంది సీ్త్రలు ఉన్నారు. జిల్లాలో 64 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు.
జిల్లా ఓటర్లు 14,12,331 మంది
పురుషుల కంటే మహిళలు
8,683 మంది ఎక్కువ
Comments
Please login to add a commentAdd a comment