●హర హర మహాదేవ
ఓంకార నాదం మార్మోగింది. పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనించింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. లయకారుడు...లంకేశ్వరుడు కరుణ కోసం ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. ఉపవాసాలు ఆచరిస్తూ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రంతా ఆలయాల్లో జాగరణ చేశారు. ఇక ప్రసిద్ధిగాంచిన హేమావతి సిద్ధ్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయంలో బుధవారం మధ్యాహ్నం శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం వద్ద అర్చకులు కాలసర్ప దోష నివారణ పూజలు నిర్వహించారు. – సాక్షి బృందం
●హర హర మహాదేవ
●హర హర మహాదేవ
●హర హర మహాదేవ
●హర హర మహాదేవ
Comments
Please login to add a commentAdd a comment