అతిగా ఆవేశపడితే అసలుకే మోసం..
ఉరుకులు, పరుగుల జీవితంలో అంతా పోటీనే. చదువుల్లో...ఉద్యోగాల్లో...వ్యాపారాల్లో..ఇలా ప్రతిచోట పోటీ ఉంటోంది. వెనుకబడతామోనన్న ఆందోళనలో చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతస్థానం కోసం, మెరుగైన మార్కుల కోసం, అధిక లాభాల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పరుగులు తీస్తున్నారు. కనీసం అరగంట ప్రశాంతంగా కూర్చుని భోజనం కూడా చేయడం లేదు. ఆకలివేసినా హడావుడిగా పిజ్జాలు, బర్గర్లు ఇతర జంక్ ఫుడ్ పొట్టలోకి తోసేస్తున్నారు. ఆందోళన, అధికశ్రమ, మారిన ఆహార అలవాట్లతో రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత సంపాదించినదంతా ఖర్చు చేసినా మునపటి ఆరోగ్యాన్ని తెచ్చుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment