అన్నదాత ఆక్రందన
● ప్రీమియం సొమ్ము రైతులే
చెల్లించాలంటున్న అధికారులు
● ఎకరా వరి పంటకు రూ.630 కట్టాలని ఆదేశం
● జిల్లా వ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా భారం
● ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకుండా
వంచించిన కూటమి ప్రభుత్వం
నరసన్నపేట:
అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై అదనపు భారం మోపుతోంది. ఎన్నికల హామీలు అమలు చేయాల్సింది పోయి గత వైఎస్సార్ సీపీ అమలుచేసిన పథకాలకు మంగళం పాడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే పెట్టుబడి రాయితీ ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత పంటల బీమా పథకానికీ స్వస్తి చెప్పింది. ఇకపై బీమా ప్రీమియం మొత్తాన్ని రైతులే కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో పథకాలు ఇవ్వకపోగా తిరిగి ఆర్థిక భారం మోపడం దారుణమని రైతులు మండిపడుతున్నారు.
ఉచిత బీమాకు మంగళం..
రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు ప్రకృతి విపత్తులకు, ఇతర చీడపీడలకు గురై దిగుబడి తగ్గి నష్టం వాటిల్లినప్పుడు ఉచిత పంటల బీమా పథకం రైతులకు ఆసరాగా నిలుస్తుంది.
బీమా చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పరిహారం అందుతుంది. అయితే ఆయా పంటలకు కంపెనీలు నిర్థారించిన ప్రీమియం గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం ప్రీమియం చెల్లించడం లేదు. రబీ సీజన్ నుంచి ప్రీమియం అన్నదాతలే కట్టుకోవాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
చెల్లించేదెలా?
జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండగా ఖరీఫ్ సీజన్‌లో 3,60,325 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో ఇతర వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. వీటిన్నీంటికీ బీమా కావాలంటే రైతులు తమ వాటా చెల్లించాల్సిందే. వచ్చే ఖరీఫ్‌కు రైతులకు బీమా ప్రీమియం మరింత భారంగా మారనుంది. ఒక్క వరి రైతులపైనే రూ.20 కోట్లు వరకూ భారం పడనుంది. మిగిలిన పంటలు సాగు చేసే రైతులపై మరో రూ.10 కోట్లు వరకూ భారం తప్పదు. ఎకరా వరికి రైతు వాటాగా రూ.630 చెల్లించాలి. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతుల నుంచి అయితే బ్యాంకర్లే ప్రీమియం చెల్లించి రైతుల ఖాతాల్లో అప్పు కింద వేస్తారు. బ్యాంకుల్లో రుణం తీసుకోని తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న, సన్న కారు రైతులు బీమా కావాలంటే మాత్రం వారే చెల్లించుకోవాలి. ఈ భారం అధికంగా ఉంటుందని రైతులు అంటున్నారు.
మారిన ఇన్సూరెన్స్ విధానం..
OÆð‡™èl$-ÌSMýS$ H Ñ«§ýl…V> Ðól$Ë$ fÇ-W™ól B Ñ«§ýl…V> {ç³Äñæ*-f¯]l… MýSÍW…^ól…-§ýl$MýS$ VýS™èl {糿¶æ$™èlÓ… ^èl*õÜ-Ñ. M>± MýS*rÑ$ {糿¶æ$™èlÓ… AÌê M>§ýl$. {ç³Äñæ*-f¯]l… ´÷…§ól OÆð‡™èl$ÌS çÜ…QÅ G…™èl ™èlWY™ól A…™èl Ðól$ÌS° ¿êÑ-Ýù¢…-¨. ©°MìS M>Æý‡×æ… ½Ð]l*-ె¯ŒSÞ Ñ«§é¯]l… Ð]l*Æý‡ayýlÐól$. OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ A«¨M>-Æý‡…ÌZ E¯]l²-糚yýl$ Ðé™é-Ð]lÆý‡×æ B«§é-Ç™èl ½Ð]l* E…yól¨. MýS*rÑ$ {糿¶æ$™èlÓ… ¨VýS$-ºyìl B«§é-Ç™èl ½Ð]l*-ె¯ŒSÞ Ñ«§é¯]l… AÐ]l$-ÌZÏMìS ¡çÜ$-MýS$Ð]l-_a…-¨. ç³…r Mø™èl {ç³Äñæ*-V>ÌZÏ Ð]l^óla ¨VýS$-ºyìl, I§ólâýæÏ M>ÌS…ÌZ çÜÆ>çÜÇ Ð]l^óla ¨VýS$-ºyìl B«§é-Æý‡…V> ^ólçÜ$-Mö° ½Ð]l* Ð]lÇ¢…-^ól…-§ýl$MýS$ ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…sZ…¨. ©…™ø ½Ð]l* ¯]l$…_ ò³§ýlªV> Eç³-ÔèæÐ]l$¯]l… E…yýl§ýl° OÆð‡™èl$Ë$ A…r$-¯é²Æý‡$. MúË$ OÆð‡™èl$-ÌSMýS$ MýS*yé Cº¾…-§ýl$Ë$ ™èlç³µyýl… Ìôæ§ýl$. MúË$ M>Æý‡$zË$ Ìôæ° OÆð‡™èl$ÌSMýS$ Gr$-Ð]l…sìæ ½Ð]l* Ð]lÇ¢…^èl§ýl$. VýS™èl…ÌZ D&{M>‹³ ^ólçÜ$MýS$¯]l² OÆð‡™èl$Ë$ A…§ýl-ÇMîS ½Ð]l* Ð]lÇ¢…-^ól-¨. {糿¶æ$™èlÓ… Mö™èl¢ Ñ«§é¯]l… AÐ]l$Ë$ ^ólçÜ$¢…-yýlr…™ø MúË$ OÆð‡™èl$ÌS M>Æý‡$zË$ E¯]l² ÐéÇMóS ½Ð]l* Ð]lÇ¢-çÜ$¢…¨. ÐéÆó‡ {ï³Ñ$Ķæ$… MýSsôæt…-§ýl$MýS$ AÆý‡$áË$.
రబీలో ప్రీమియం చెల్లింపులు ఇలా..
బడ్డవానిపేట వద్ద గాలులకు నేలకొరిగిన వరి పంట
వరి
మినుములు
చోడి
వేరుశనగ
పెసలు
మొక్కజొన్న
రైతు వాటా
ప్రీమియం (ఎకరాకు)
రూ. 630
రూ. 240
రూ. 300
రూ. 570
రూ. 480
బీమా మొత్తం
రూ.20వేలు
రూ.16వేలు
రూ.32వేలు
రూ.38వేలు
Comments
Please login to add a commentAdd a comment