రేపే అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ
టెక్కలి : రైతు సమస్యలపై ఈ నెల 13న చేపట్టనున్న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ’ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బుధవారం కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకుల సూపర్ సిక్స్ హామీలతో మోసపోయామని ప్రజలకు అర్ధమైందని.. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 40 శాతం ఓట్లు దక్కించుకున్న ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కిందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. టెక్కలి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 4 వేల కోట్ల రూపాయలతో పోర్టు ఏర్పాటుకు నాంది పలికిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. గ్రామ స్థాయిలో వైఎస్సార్‌సీపీ ఎంతో బలంగా ఉందని, కూటమి నాయకుల చేతిలో మోసపోయిన ప్రజలకు అండగా ఐకమత్యంగా పోరాటాలు చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సారధ్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పెద్ద ఎత్తున మోసగించారని పేర్కొన్నారు.
రైతు సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని విజయవంతం చేయాలి
సూపర్‌సిక్స్‌తో మోసపోయామని
ప్రజలకు అర్ధమైంది
టెక్కలిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పార్టీ జిల్లా
అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
కార్యకర్తకు అండగా ఉంటాం...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ నెల 21 జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా టెక్కలిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో కృష్ణదాస్‌తో కలిసి ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పి.భార్గవి, పి.వసంత్‌రెడ్డి, డి.వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు ఎస్.సత్యం, పి.రమేష్, ఆర్.ఉమామల్లయ్య, వై.చక్రవర్తి, కె.గోవింద్, బి.నాగేశ్వరరావు, కె.బాలకృష్ణ, ఎన్.సత్యరాజ్, ఎస్.హేమసుందర్‌రాజు, ఎ.కళ్యాణి, రాములమ్మ, టి.కిరణ్, హెచ్.వెంకటేశ్వరరావు, బి.మోహన్‌రెడ్డి, కె.సంజీవ్, జె.జయరాం, టి.వైకుంఠరావు, పి.మోహన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment