రాష్ట్ర సచివాలయ సదస్సులో జిల్లా కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సుకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎస్పీ మహేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు.
వైభవంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం అర్బన్: ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వై.భద్రాజీ, సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు, అర్చకులు పాల్గొన్నారు.
నేటి నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల మొదటి సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించనున్నట్లు డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఇన్‌చార్జి డీన్ జి.పద్మారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లాలోని 83 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నుంచి 10051 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు 55 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment