పీడీఎస్ బియ్యం పట్టివేత
పాతపట్నం మండలం తెంబూరులో బోయిన ఫాల్గుణరావు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2.13 క్వింటాళ్ల పీడీఎస్(రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ బి.ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. గతంలో కూడా ఫాల్గుణరావుపై పలుకేసులు ఉన్నాయని, బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో అతని ఇంటిపై దాడి చేసి బియ్యం పట్టుకున్నా మని అధికారులు తెలిపారు. బియ్యం స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. – పాతపట్నం
Comments
Please login to add a commentAdd a comment