బీల ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి
శ్రీకాకుళం: సోంపేట మండలంలోని బీల భూము ల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించిన ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ ఎస్.విజయభారతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో పాటు 723 మందిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అనంతరం ఆమె స్పందిస్తూ కేసులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఢిల్లీరావు, న్యాయ సలహాదారులు, ఉత్తరాంధ్ర జర్న లిస్టుల సమాఖ్య అధ్యక్షులు చౌదరి లక్ష్మణరావు, అగూరు ఉమామహేశ్వరావు, హమీరుల్లా బేగం, బద్రి సీతమ్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment