వంశధార నిర్వాసితులను ఆదుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రాజెక్టులపై యుద్ధభేరి కార్యక్రమం సందర్భంగా వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు వెంటనే అమలు చేయాలని నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 ఆగస్టు 10న నాటి ప్రతిపక్ష నాయకుడిగా యుద్ధభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులందరికీ స్పెషల్ ప్యాకేజీ కింద న్యాయం చేస్తానని హామీ ఇచ్చా రని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్ర, కేంద్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు ఈ విషయాన్ని సీఎం వద్ద ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. నిర్వాసితులను గతంలో టీడీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసినప్పటికీ ఎమ్మెల్యేగా మామిడి గోవిందరావుని గెలిపించారని, అయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. హామీని నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment