శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 20వ తేదీ ఉదయం 12 గంటలకు తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలాశాఖ సూపరింటెండెంట్ వి.హరిబాబు గురువారం తెలిపారు. శ్రీకాకుళంలోని రెల్లవీధిలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల వద్దనున్న తపాలాశాఖ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తపాలా సేవలకు సంబంధించిన వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్‌లో చర్చిస్తామని తెలిపారు. తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 20వ తేదీలోగా తపాలా అదాలత్ అనే శీర్షికన వి.హరిబాబు, తపాలా సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్, శ్రీకాకుళం–532001 అనే చిరునామాకు పంపించాలని ఆయన కోరారు. గడువు తర్వాత వచ్చిన ధరఖాస్తులు స్వీకరించబోమని, ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకుని అదాలత్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment