● జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, వేర్ హౌసింగ్ గొడౌన్ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం పంపిణీలో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలన్నారు. కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బియ్యం సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సరుకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్న ఫిర్యాదులు రాకుండా పనిచేయాలన్నారు. గిరిజన ప్రాంతాలకు సైతం రేషన్ సకాలంలో పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ మేనేజర్ టి.వేణుగోపాల్, జిల్లా సరఫరాల అధికారి జి.సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment