శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 14న జరగనున్న లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలా నా అన్నారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయమూర్తులతో ఆన్‌లైన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, 3వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎం.ఫణికుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment