ఇదేం పని?
● సర్పంచ్ చెబితేనే ఉపాధి పనులట..
● వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు
పని బంద్
● మశాఖపురం ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై విమర్శలు
ఇచ్ఛాపురం రూరల్:
‘వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఉపాధి పనులు ఇవ్వం. ఉప సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న సర్పంచ్ కొడుకు చెబితేనే పనులు ఇస్తాం..’ ఈ మాట అన్నది ఎవరో కాదు విచారణకు వెళ్లిన ఎంపీడీఓ ముందు సాక్షాత్ ఫీల్డ్ అసిస్టెంట్ అనపాన షర్మిళ. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం మశాఖపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గత ప్రభుత్వ హయాంలో తప్పుడు మస్టర్లు, ఒకరి పేరున మరొకరికి పనిలోకి పంపించడం, ఉపాధి పనికి రాని వారి పేర్లు మస్టర్లో వేసి సొమ్ము కాజేసినట్లు ఆరోపణలతో ఉపాధి వేతనదారులు అప్ప ట్లో ఎంపీడీఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అనంతరం పీడీ చిట్టిరాజు ఆదేశాల మేరకు ఎంపీడీఓ, ఏపీఓలు విచారణ చేసి, తప్పు జరిగినట్లు రుజువు కావడంతో ఆమెను 2023 ఆగస్టు 28న తొలగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరలా ఆమెను ఇటీవల ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించారు. తనపై గతంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై కక్ష పెంచుకున్న షర్మిళ రెండు వారాలుగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు సుమారు 60 మంది కూలీలను పనులకు పిలవడం లేదు. టీడీపీ సర్పంచ్ వర్గీయులకు మాత్రమే పనులు ఇవ్వడం పట్ల కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండు రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ కె.రామారావు గురువారం మశాఖపురంలో ఉపాధి పనులు జరుగుతున్న పని ప్రదేశానికి వెళ్లి విచారణ చేపట్టారు. ప్రస్తుతం పని చేస్తున్న వారికి మాత్రమే పనులు ఇవ్వాలంటూ సర్పంచ్ ప్రతినిధి చెప్పారని, అందుకే మిగతా వారిని పనులకు పిలవడం లేదంటూ చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ఉపాధి పనులు ఇవ్వాలని, సోమవారం నుంచి మిగతా వారికి పనులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
కక్షతోనే..
షర్మిళ గతంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో చేసిన అవకతవకలపై ఫిర్యాదు చేయడంతో ఆమెను తొలగించారు. ఇటీవల మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించ డంతో ఫిర్యాదుదారులపై కక్ష పెంచుకున్న ఆమె రెండు వారాలుగా మమ్మల్ని పనులకు పిలవడంలేదు. నాతో పాటు పాల గీత అనే మేట్‌ను తొలగించారు.
– ఆశి ఇందిర, మేట్, మశాఖపురం
Comments
Please login to add a commentAdd a comment