చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. సాయం లేక అన్నదాతలు వెన్ను విరగ్గొట్టుకున్నారు. న్యాయం జరగక గంగపుత్రులు బెంగ పెట్టుకున్నారు. పౌరసేవకు ప్రదక్షిణలు తప్పవని సామాన్యుడు తెలుసుకున్నాడు. పథకాల పేర్లు మార్చినంత సులువుగా డబ్బులు ఇవ్వరని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. అమ్మ ఒడికి అలవాటు పడిన ఆడపడుచులతో పాలకులు ‘తల్లికి వందనం’ అనలేకపోయారు. హామీలు ఆరు.. మిగిలింది కన్నీరు అన్నట్టుగా కూటమి తొలి ఆరునెలల పాలన సాగింది. రాజకీయ కక్ష సాధింపులు, గిట్టని వారిపై వేధింపులు, కానివారి తొలగింపులతోనే పాలకులకు సమయం సరిపోయింది. సూపర్ సిక్స్ గురించి ఆలోచన చేసేంత తీరిక కూడా లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment