ర్యాలీకి తరలిరండి
– వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు
నరసన్నపేట: రైతన్నలకు చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల వారు తర లిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టనున్న ర్యాలీపై స్థానిక పార్టీ కార్యాలయంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి ఆయన మాట్లాడారు. కూట మి అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలోనే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని అన్నా రు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు మడపాం టోల్ గేట్ వద్దకు 9 గంటలకు చేరుకోవాలని కృష్ణదాస్ సూచించారు. పార్టీ శ్రేణులు, రైతులు శుక్రవా రం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం దరి జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 11 గంటలకు కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment