విద్యపై శీతకన్ను
మత్స్యకారుల పొట్ట కొట్టారు..
ఎలాగైనా అధికారంలోకి రావా లని ఇష్టానుసారంగా హామీలిచ్చేసి ఇప్పుడు ఎవడేం చేస్తారులే అనుకుని హామీలను అమలు చేయడం లేదు. వేటే ఆధారంగా బతుకుతున్న మా మత్స్యకారులకు ఏటా మే–జూన్ వేట నిషేధ కాలంలో జీవన భృతి గత ఐదేళ్లు క్రమం తప్పకుండా ఇచ్చారు. చంద్రబాబు మాత్రం ఈ వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20వేలకు పెంచేస్తామని చెప్పి.. అసలు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. మా పొట్ట కొట్టారు. మొత్తం 15,200 మందికి రూ.30.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని కూడా నమ్మకం లేకుండా పోయింది.
– కోనాడ నరిసింగరావు,
జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షుడు
నమ్మి మోసపోయారు
ప్రభుత్వం వచ్చి ఆరునెలలు గడి చిపోయాయి.18–50 ఏళ్ల్ల మధ్య గల మహిళలకు ఏడాదికి రూ. 1500 ఇస్తామని చెప్పారు. కానీ ఆ మాట మర్చిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మిన వారు మోసపోయారు. ఆరు నెలలవుతున్నా పథకంపై ఎలాంటి కసరత్తు చేయలేదు. – వడమ పుష్పలత,
కొత్తూరు గ్రామం, కొత్తూరు మండలం
టెక్కలి:
సామాన్యులకు అందించే తల్లికి వందనంపై కసరత్తే జరగలేదు...కానీ తమ నేతల జేబులు నింపే ఇసుక పాలసీని మాత్రం ఆగమేఘాలపై అమలు చేశారు. అన్నదాత సుఖీభవ అనడానికి నోరు రాలే దు.. కానీ అనుయాయుల ఖజానాలు నింపే మద్యం పాలసీకి మాత్రం క్షణం కూడా ఆలస్యంగా చేయకుండా పథక రచన చేశారు. మత్స్యకారులకు భృతి ఇవ్వమంటే అర్హుల జాబితా ఇంకోసారి చూస్తామంటూ నెలలు గడిపేశారు.. కానీ గిట్టని వారిని వెతికి వెతికి మరీ ఉద్యోగాల నుంచి తీసేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసే విష యంలో మీనమేషాలు లెక్క పెడుతున్న కూటమి ప్రభుత్వం నేతల జేబులు నింపే పనులైతే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా చేసేస్తోంది.
ఊరూరా తిరిగారు.. ఇంటింటికీ ప్రచార పత్రాలు పంచి పెట్టారు. చెవులు చిల్లులు పడేలా కాల్స్ చేసి విసిగించారు. తీరా అధికారం చేతికి వచ్చాక చెప్పిన మాట మర్చిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూకుమ్మడి ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అధికారం చేపట్టి ఆరు నెలలవుతున్నా.. సూపర్ సిక్స్ హామీలను ఇంకా అమలు చేయలేదు.
ఆపడమే పనిగా..
● ఆరు నెలల పాలనలో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయకపోగా బీమా భారం వేశారు.
● ధాన్యం కొనుగోలు విషయంలో సరికొత్త విధానం పేరుతో దళారీ వ్యవస్థను మరింత పదిలం చేస్తూ రైతుల నడ్డి విరిచేశారు.
● ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు తల్లికి వందనం అన్నారు, ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం ఇస్తామని ప్రసంగాలు చేశారు, విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ ఆ పథకం ఊసే లేదు.
● ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ అని ప్రకటించారు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత సిలిండర్ అంటున్నారు.
● వసతి గృహాల్లో ఉంటూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన చెల్లింపులు నిలిపివేశారు.
● సముద్రంలో వేట నిషేధంలో మత్స్యకారులకు భృతి ఇవ్వలేదు.
● గత ప్రభుత్వంలో సర్వాంగ సుందరంగా మారి న ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నాడు–నేడు పనులను నిలిపివేశారు.
● గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే అందిన వైద్య సేవలు కూడా ఆపేశారు.
● ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకోవాలంటే అనేక ప్రయాసలు పడాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ ఆసరా సైతం అందజేయడం లేదు.
● జిల్లాలో అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి కలిగిన గ్రానైట్ క్వారీలను నూతన విధానం పేరుతో 4 నెలల పాటు అనుమతులు నిలిపివేశారు. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు.
● పేద, సామాన్యులపై మరింత ఆర్థిక భారం పడే విధంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకే విధంగా చేశారు.
● పాలన వైపు దృష్టి సారించకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో సామాన్యులు, దళితులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు పేట్రేగిపోయాయి. శాంతి భద్రతలు గాడి తప్పాయి.
● చిరుద్యోగులపై కక్షపూరితమైన తొలగింపు కుట్రలకు పాల్పడ్డారు.
వైఎస్ జగన్ పాలనలో..
●
● మే నెలలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా అందేవి.
● జూన్ నెలలో జగనన్నతోడు, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ చేయూత పథకాలు అందేవి.
● జూలై నెలలో జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ కాపునేస్తం, జగనన్న విద్యా కానుక పథకాలు అందేవి.
● ఆగస్టు నెలలో రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ, ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక రాయితీలు, వైఎస్సార్ నేతన్న నేస్తం, అగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపులు జరిగేవి.
● అక్టోబర్ నెలలో మరో సారి వైఎస్సార్ రైతు భరో
ఆరు నెలల పాలనలో ఘోరంగా మోసపోయిన ప్రజలు
కూటమి నాయకులకు అనుకూలంగా ఇసుక, మద్యం వ్యవస్థలు
సామాన్యులకు అందనంత ఎత్తులో నిత్యావసరాల ధరలు
రాజకీయ కక్షలకు బలైపోయిన చిరుద్యోగులు
కూటమి ప్రభుతం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లు నిరాటంకంగా అందిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా నిలుపుదల చేసేసింది. తల్లికి వందనంపై ఎలాంటి కసరత్తు చేయలేదు. సర్కారీ బడుల్లో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్సీ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, బైజూస్ కంటెంట్‌తో కూడిన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, టోఫెల్ శిక్షణ, ఐబీ విధానం, నాడు–నేడు ద్వారా పాఠశాలలకు కొత్త శోభ, మౌలిక సదుపాయాల కల్పన వంటివి వైఎస్సార్ సీపీ సమర్థంగా చేసి చూపిస్తే..వాటన్నింటినీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆపేసింది. ఆఖరి దశలో ఉన్న నాడు–నేడు పనులకు నిధులు విదల్చకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
– శ్రీకాకుళం న్యూకాలనీ
Comments
Please login to add a commentAdd a comment