సాంకేతిక సాయమూ అందలేదు
టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరంభంలో విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందజేయలేదు. పంట చేతికి వచ్చిన సమయంలో దళారీలను ప్రోత్సహించే విధంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థకు పక్కదారి పట్టించేస్తున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో ప్రాంతాల వారీగా ఏయే భూములకు ఎలాంటి లాభదాయకమైన పంటలు వేయాలి, ఆయా పంటలకు ఎలాంటి పోషకాలు అందజేయాలి, పంటల రక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాస్త్రవేత్తలతో నిత్యం మమేకమయ్యే విధంగా కార్యక్రమాలను సాంకేతికంగా రైతులకు చేరువగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో కియోస్క్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి ఒక్కో సెంటర్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆయా కేంద్రాల నిర్వాహణకు అవసరమైన నిధులు సమకూర్చారు. వీటితో పాటు వ్యవసాయంతో పాటు ఇతర పంటల సాగులో సాంకేతికంగా మెలకువలు నేర్పించేందుకు సుమారు రూ.1.50 లక్షల విలువైన కియోస్క్ యంత్రాలను అందజేశారు. ప్రభుత్వం మారాక ఈ సేవలన్నీ మూలకు చేరిపోయాయి. గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 656 రైతు భరోసా కేంద్రాలు (ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు) కియోస్క్ సేవలు అందజేసేవారు. ఇవన్నీ ఇప్పుడు మూలకు చేరాయి.
నిలువునా దగా
● జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఈ–క్రాప్ రిపోర్టు ప్రకారం 3,59,985 ఎకరాల్లో సుమారు 2,94,285 మంది రైతులు సాగు చేస్తున్నారు. అధికార లెక్కల ప్రకారం గుర్తింపు పొందిన వీరందరికీ అన్నదాత సుఖీభవ పథకం అందలేదు. ఇందులో ఈ– క్రాప్‌లో నమోదు కాకుండా ఎంత మంది ఉన్నారో లెక్కకు రాలేదు.
● అలాగే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 8.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. ఇందులో కేవలం 4.90 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోలుకు లక్ష్యం నిర్దేశించా రు. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఒక్కో బస్తాకు అదనంగా 2 నుంచి 3 కిలోల ధాన్యం కాజేస్తున్నారు.
● గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ప్రభుత్వమే నేరుగా రైతుల తరపున బీమా చెల్లింపులు చేసేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉచి త పంటల బీమాకు మంగళం పాడేశారు. రైతులే బీమా డబ్బులు చెల్లించుకోవాలంటూ అదనపు భారం వేశారు. దీంతో రైతులపై సుమారు రూ. 30 కోట్ల భారం పడనుంది.
జిల్లాలో మూలకు చేరిన కియోస్క్ యంత్రాలు
గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 656 ఆర్‌బీకేల్లో ఒక్కో సెంటర్‌కు రూ.3 లక్షల ఖర్చుతో ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment