ఎయిర్‌పోర్టు నిర్మిత ప్రాంతంలో వామపక్షాల పర్యటన
కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ఎయిర్‌పోర్ట్ ప్రభావిత గ్రామాలైన వంకులూరు, బీడీమీ రాంపురం, గంగువాడ, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో వామపక్ష నాయకుల బృందం గురువారం పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. గ్రామాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్‌పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ పలాస కార్యదర్శి చాపర వేణుగోపాల్, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా నాయకులు వీరస్వామి, బాలకృష్ణ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్ సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే సహించేది లేదని వారు హెచ్చరించారు.
మతసామరస్యానికి ప్రతీక
ఇచ్ఛాపురం: ఏటా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో జరిగే పీర్లకొండ యాత్ర మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ గురువారం నిర్వహించినయాత్రకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. పీర్లకొండ యా త్రలో హిందువులంతా లక్ష్మిదేవికి పూజలుచేయడం, ముస్లింలంతా అల్లాకి ప్రార్థనలు చేయడం ప్రత్యేకత. హిందువులంతా మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజలు చేసి కొండపైకి ఎక్కడం మొదలుపెడతారు. ఈ యాత్రకి కోల్‌కతా, ఒడిశాలోని కటక్, భువనేశ్వర్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రాలోని విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి వంటి దూరప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment