10 ఇసుక ట్రాక్టర్లు సీజ్
● సీఎం కార్యాలయానికి ఫిర్యాదు అందడంతో కదిలిన యంత్రాంగం
● ఇసుక లోడుతో ఉన్న 10 ట్రాక్టర్లను తమ్మినాయుడుపేట వద్ద అడ్డుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు
ఎచ్చెర్ల క్యాంపస్: తమ్మినాయుడుపేట ఇసుక రీచ్ నుంచి 16వ నంబరు జాతీయ రహదారిపై తరలివెళ్తున్న 10 ఇసుక ట్రాక్టర్లను అధికారులు గురువారం నిలిపివేశారు. తహసీల్దార్ ఎం.సింహాచలంతో కూడిన రెవెన్యూ అధికారుల బృందం, పోలీస్ సిబ్బంది వాహనాలు నిలిపివేశా రు. తమ్మినాయుడుపేట ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్లు ద్వారా ఇసుక తరలించి, సమీపంలో పోగులు వేస్తున్నారని, విశాఖపట్నం అర్ధరాత్రి ఇసుక లారీలు, టిప్పర్లలో తరలిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యా దులు వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్ బృందాలు దాడులు చేశాయి. ఇసుక తరలిస్తున్న వారు, స్థానికులు అధిక సంఖ్యలో చేరుకుని పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం నిబంధనల మేరకు మాత్రమే తాము ఇసుక తరలిస్తున్నామని, రీచ్‌లలో కూలీలతో ట్రాక్టర్‌లో లోడింగ్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పారు. అయితే ఇసుక అక్రమంగా పోగులు వేస్తున్నారని, నిరంతరం అక్రమ రవాణా సాగుతోందని అధికారులు అన్నారు. ఉచితం ముసుగులో అక్రమంగా పోగులు వేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. మైన్స్ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చి, పది ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment