
ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మూడు బాలురు, ఆరు బాలికల బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన ట్లు ఆ సంస్థల జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థు లు వారికి హాల్ టిక్కెట్‌లో కేటాయించిన పరీక్షా కేంద్రానికి మాత్రమే హాజరుకావాలని సూచించారు. apbragcet.apcfss.inనుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు గా ఆధార్ కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకోవాలని తెలిపారు. వివరాలకు 9701736862 – 9000314209 నంబర్‌ను సంప్రదించాని తెలిపారు.
‘జిల్లా అభివృద్ధిపై దృష్టి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సహచర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లా నరేగా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్ల మెటీరియల్ కాంపోనేంట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో గుంతలు లేని రోడ్ల పనులు ఇ ప్పటికే 96 శాతం పూర్తయ్యాయని, వేసవి ముగిసేలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాగోలులో జెమ్స్ ఎదుట రూ.2.92 కోట్లతో సైనిక్ భవన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకకు వీలుగా అనుకూలమైన ముహూర్తాలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. కిడ్నీ సంబంధిత మరణాలపై పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. అంతకుముందు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. సమా వేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, మామిడి గోవిందరావు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి పోషణ పఖ్వాడా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
నాటుసారా ముద్దాయిలపై బైండోవర్
పలాస: పలాస మండలంలోని పెదంచల, చినంచల, పెంటిభద్ర, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాటు సారా కేసులో దొరికిన 35 మంది పాత ముద్దాయిలపై పలాస ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం బైండోవర్ కేసులు కట్టించారు. పలాస డిప్యూటీ తహసీల్దార్ టి.లక్ష్మీనారాయణ సమక్షంలో వారి కార్యాలయంలో ఈ కేసులు కట్టించారు. ఒక ఏడాది కాలపరిమితికి రూ.లక్ష జరిమానా బాండుతో ఈ కేసులు కట్టినట్టు పలాస ఎకై ్సజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.మల్లిఖార్జునరావు చెప్పారు.
మే 10న
జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయపరమైన సమస్యలు ఎ దుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, లోక్ అదాలత్ ద్వారా శాంతియుతంగా, పరస్పర అంగీకారంతో తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.