
జగన్ భద్రతపై కూటమి కుట్రలు
● వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. ఈ మేరకు టెక్కలిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. దీంతో ఏదో రకంగా అల్లర్లు సృష్టించి దానిని వైఎసా్‌స్‌ర్‌సీపీ మీద నెట్టేయాలని కూటమి నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే రామగిరి పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను కుదించారని దుయ్యబట్టారు. భద్రత విషయంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా, దానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, ఆ విషయం హోంమంత్రి అనితకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, టీడీపీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసుల వలన పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. దీనికి తగినమూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందడంతో నడిరోడ్డుపై లింగమయ్యను హత్య చేశారని, దీంతో ఆ కుటుంబాన్ని జగన్ పరా మర్శించడానికి వెళ్లగా, దానిపై హోంమంత్రి బాధ్య తారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అలాగే ఒక మాజీ సీఎం భార్యపై నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వ్యక్తిపై కేవలం నామమాత్రపు చర్యలతో వదిలేస్తున్నారని మండిపడ్డారు.