
పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌం
ఆటాడుకుందాం.. రా అంటూ మైదానం పిలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో చిన్నారులకు వేసవి సెలవులు సైతం ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు, విద్యార్థులు మైదానం బాట పట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికితోడు ఐపీఎల్ మేనియా బాగా పనిచేస్తోంది. తమ అభిమాన ఆటగాళ్లను అనుకరిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా మైదానాల్లో సందడి..
ఆటపాటలతో మైదానాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు కళింగపట్నం, సింగుపురం, ఇచ్ఛాపురం, సోంపేట, మకరాంపురం, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, నరసన్నపేట ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం తదితర ప్రాంతాల్లోని క్రీడాకారులు, విద్యార్థులు, యువత, చిన్నారులు మైదానాల్లో సందడి చేస్తున్నారు. వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునేందుకు రెడీ అయిపోతున్నారు. దీనికితోడు త్వరలో మొదలయ్యే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను కూడా వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొంతమంది త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడంలో తలమునకలవుతున్నారు.
ఇక్కడే అన్నీ..
ఒకప్పుడు స్పోర్ట్స్ మెటీరియల్స్ కోసం విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లా కేంద్రంలో విస్తారంగా స్పోర్ట్స్ దుకాణాలు వెలిశాయి. క్రీడా దుస్తుల విక్రయాలతోపాటు క్రికెట్ కిట్లు (బాల్స్, బ్యాట్స్, ప్యాడ్స్, గ్లోవ్స్, ఇతరాలు), వాలీబాల్, షటిల్ రాకెట్స్ మొదలుకుని క్రీడా సామగ్రి విక్రయాలతో షాపుల్లో సందడి వాతావరణం నెలకొంది. వీటితోపాటు ఫిట్‌నెస్ మెరుగు కోసం వివిధ యాంత్రిక పరికరాలు, బండిల్స్ విక్రయాలు కూడా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
టోర్నీలు, లీగ్ మ్యాచ్‌లతో హడావుడి
వేసవి సెలవుల్లో భాగంగా యువత, విద్యార్థులు పలు క్రీ డాంశాల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి, అంతర్‌రాష్ట్ర క్రీడా టోర్నీలు, లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక వేస్తున్నారు. కొన్ని చోట్ల టోర్నమెంట్లను కూడా మొదలుపెట్టేశారు. ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యా డ్మింటన్, క్రీడాంశాల్లో టోర్నీలకు చురుగ్గా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు ఫుట్‌బాల్, చెస్, క్యారమ్స్, కరాటే, తైక్వాండో, జూడో క్రీడాంశాల్లోను పోటీలకు కసరత్తులు చేసుకుంటున్నారు.
జిల్లాస్థాయి, ఓపెన్ టోర్నీలు, లీగ్ మ్యాచ్‌ల సన్నద్ధతతో మైదానాల్లో సందడి
క్రీడాసామగ్రి విక్రయాలతో స్పోర్ట్స్ షాపులు కళకళ
వేసవిలో మైదానాల బాట పడుతున్న విద్యార్థులు
మరికొద్ది రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మొదలు
ఎండలతో జాగ్రత్తలు తప్పనిసరి..
మండే ఎండల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత ఉష్ణాగ్రతల నేపథ్యంలో ఉదయం గరిష్టంగా 10.30 వరకు, మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మాత్రమే మైదానాల్లో ఆడుకోవడం ఉత్తమం. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గ్లూకోజ్, నిమ్మరసం, ఆరెంజ్ వంటి ద్రావణాలను అధిక మోతాదులో తీసుకోవాలి. కొబ్బరిబొండాలు, మజ్జిగ తీసుకోవడం మంచిది.
– డాక్టర్ బొడ్డేపల్లి సురేష్‌కుమార్, వైద్యులు, సన్‌రైజ్ హాస్పటల్ ఎండీ శ్రీకాకుళం
మన్నికై నవి వాడాలి..
క్రీడాదుస్తులు, క్రీడా సామగ్రి కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ సామగ్రి కూడా వచ్చేస్తున్నాయి. ఒకటికి రెండుసార్లు చూసి కొనుక్కోవాలి. మన్నికై నవి తీసుకుంటే ఎక్కువ రోజులు వినియోగించవచ్చు.
– మొజ్జాడ వెంకట రమణ, సీనియర్ పీడీ, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు
అటు టెన్త్, ఇటు ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తదుపరి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతూనే.. విద్యార్థులు ఆటలపోటీల్లో నిమగ్నమవుతున్నారు. ఆటలన్నాక గెలుపోటములు సహజం. ఈ రోజు ఓటమి రేపటికి గెలుపునకు నాంది. రెండింటినీ సమానంగా తీసుకోవాలి. తోటి ఆటగాళ్లపై స్నేహభావంతో మెలగాలి. – సంపతిరావు సూరిబాబు,
బ్యాడ్మింటన్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా సీఈఓ

పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌం

పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌం

పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌం

పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌం

పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌం