ఆకలి బాధ తీరేదెలా..
హుజూర్‌నగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక ఆకలి బాధ అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించి అమలు చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
జూనియర్ కళాశాలలు ఇలా..
జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, నడిగూడెం, నెమ్మికల్, తుంగతుర్తితోపాటు ఈ ఏడాది తొండతిరుమలగిరిలో కొత్తగా ఏర్పాటైన దానితో కలిసి మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఫస్ట్, సెకండియర్‌లో మొత్తం 2,850 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందని తమకు కూడా అమలు చేయాలని కళాశాలల విద్యార్థులు కోరుతున్నారు.
దాతలు ముందుకొస్తేనే..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చే విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారే అధికంగా ఉన్నారు. వీరికి సరైన రవాణా సదుపాయం లేనందున ఉదయం 8గంటల లోపే కళాశాలకు రావాల్సి వస్తోంది. ఆ సమయంలో ఇళ్లలో వండిన భోజనం సిద్ధంగా లేక కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం తినేందుకు విద్యార్థులు ఏమీ తెచ్చుకోకుండానే కళాశాలలకు వచ్చేస్తున్నారు. ఫలితంగా మధ్యాహ్నం తింటానికి భోజనం లేక ఒకపూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాయంత్రం వరకు ఉండాల్సి రావడంతో విద్యార్థులు ఆకలి బాధకు తాళలేక నీరసించి పోతున్నారు. ఈ క్రమంలో క్లాసుల్లో చెబుతున్న పాఠాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో కనీసం దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం గుప్పెడు మెతుకులు అందించి ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫస్టియర్ విద్యార్థులు 1,437
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 08
ఫ జూనియర్ కళాశాలల విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం
ఫ గత ప్రభుత్వం హామీ ఇచ్చినా
ఆచరణ శూన్యం
ఫ పథకం అమలుపై స్పందించని
ప్రస్తుత సర్కార్
ఫ ఎదురుచూపుల్లో పేద విద్యార్థులు
మొత్తం విద్యార్థుల సంఖ్య 2,850
సెకండియర్
స్టూడెంట్స్ 1,413
Comments
Please login to add a commentAdd a comment