మట్టపల్లిలో కృష్ణమ్మకు కార్తీక హారతి
మఠంపల్లి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద ప్రహ్లాద స్నానఘట్టంలో శుక్రవారం రాత్రి కృష్ణానదికి అర్చకులు కార్తీక దీపాల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పల్లకీలో స్వామి ఉత్సవమూర్తులను అక్కడికి తరలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రవేశం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు,విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ.13.93లక్షలు
మట్టపల్లి దేవాలయంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి శుక్రవారం వరకు వచ్చిన హుండీలలోని కానుకలను లెక్కించామన్నారు. హుండీల ద్వారారూ.12,99,226, అన్నదానం హుండీ ద్వారా రూ.94,110తో కలిపి రూ.13,93,336 ఆదాయ సమకూరిందన్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు భక్తులు సమర్పించిన తలనీలాలకు టెండర్‌కం బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 17మంది పాల్గొనగా బొజ్జ ఏడుకొండలు కేజీ ఒక్కంటికి రూ.5,500 పాడి దక్కించుకున్నట్లు ఈఓ తెలి పారు. కార్యక్రమంలో డివిజనల్ ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ ఏడుకొండలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment