పెండింగ్ డీఏలను ప్రకటించాలి
ఆత్మకూర్(ఎస్:) ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, 010 ద్వారా వేతనాలు చెల్లించి ప్రమోషన్లు అమలు చేయాలని సూచించారు. ప్రీ ప్రైమరీ తరగతులను అంగన్వాడీల్లో కాకుండా ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహించాలన్నారు. కేజీబీవీల ఉపాధ్యాయులకు టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శి చిలక రమేష్, ఆత్మకూరు మండలం అధ్యక్షుడు పి.కరుణాకర్‌రెడ్డి, నూతనకల్ మండల అధ్యక్షుడు కె.రాజన్న, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీను, మద్దిరాల మండల అధ్యక్షుడు పి.అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment