ఆరు గ్యారంటీల అమలులో విఫలం | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీల అమలులో విఫలం

Published Sat, Nov 23 2024 1:00 AM | Last Updated on Sat, Nov 23 2024 1:00 AM

-

మునగాల: రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మునగాల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ 9వ మండల మహాసభలో, అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా, మూసీనది ప్రక్షాళన, ఇతర ప్రాజెక్టులు, గ్రూప్‌–1 పరీక్షల నిర్వహణలో వచ్చిన వివాదం, లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ పేరుతో ఇచ్చిన హామీలను పక్కనబెట్టారన్నారు. రాబోయే కాలంలో వామపక్షాలన్నీ ఏకమై ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. త్వరలో జరగబోయే జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, బుర్ర శ్రీనివాస్‌, దేవరం వెంకట్‌రెడ్డి, వీరబోయిన వెంకన్న, కందగట్ల అనంతప్రకాష్‌, వట్టెపు సైదులు, మిట్టగడుపుల ముత్యాలు, ధనియాకుల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ సీపీఎం రాష్ట కార్యదర్శి

తమ్మినేని వీరభద్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement