పంట పొలాల్లో శాటిలైట్ సర్వే
హుజూర్‌నగర్ : యాసంగి సీజన్‌లో సాగు చేసే పంటలను క్షేత్ర స్థాయిలో శాటిలైట్ సర్వే ద్వారా నమోదు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామంలో తొలుత 500 ఎకరాల్లో సాగు చేసిన యాసంగి పంటలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించి ఈ నెల చివరి వారం లోగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. సర్వేలో ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయితే రాష్ట్ర ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆ ఉత్తర్వుల్లో సూచించింది. దీంతో జిల్లా, మండల అధికారులు సర్వే కోసం పొలాల బాట పట్టనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం అమలులో భాగంగా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. సాగు చేసే పొలాలకే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని దీని
ద్వారా తెలుస్తోంది.
నమోదు చేసే వివరాలు..
శాటిలైట్ సర్వే ద్వారా ప్రత్యేకంగా మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రైతులకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. రైతు పేరు, ఏఏ సర్వే నంబర్లలో ఏ రకమైన పంటలు వేశారు. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగుచేశారు. పంట సాగుచేయని సర్వే నంబర్లు ఏమిటి, దాని విస్తీర్ణం వంటి వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు. సర్వేకు సంబంధించిన ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో పంటల వివరాలు నమోదు చేసేందుకు ఆయా గ్రామాల ఏఈఓలు సిద్ధంగా ఉన్నారు.
మండలాల వారీగా ఎంపిక
చేసిన గ్రామాలు
మండలం ఎంపిక చేసిన గ్రామం
సూర్యాపేట కేసముద్రం
చివ్వెంల చందుపట్ల
పెన్‌పహాడ్ అనంతారం
ఆత్మకూరు (ఎస్) కందగట్ల
తుంగతుర్తి వెలుగుపల్లి
తిరుమలగిరి సిద్దిసముద్రం
జాజిరెడ్డిగూడెం కుంచమర్తి
నూతనకల్ యడవల్లి
నాగారం పస్నూరు
మద్దిరాల జి. కొత్తపల్లి
గరిడేపల్లి తాళ్లమల్కాపురం
హుజూర్‌నగర్ వేపలసింగారం
నేరేడుచర్ల బోడల్‌దిన్నె
పాలకవీడు యల్లాపురం
చింతలపాలెం చింతిర్యాల,
మేళ్లచెరువు నల్లబండగూడెం
మఠంపలి అల్లిపురం
అనంతగిరి యశంతపురం
చిలుకూరు కొండాపురం
కోదాడ గుడిబండ
మోతె అన్నారిగూడెం
మునగాల గణపవరం
నడిగూడెం కాగితరామచంద్రాపురం
ఫ పైలెట్ ప్రాజెక్టుగా మండలానికి
ఒక గ్రామం ఎంపిక
ఫ జిల్లావ్యాప్తంగా 23 గ్రామాలు ఎంపిక
ఫ క్షేత్రస్థాయిలో పంటల సాగు వివరాల నమోదు
ఫ త్వరలో ప్రారంభించేందుకు
సన్నాహాలు
మండలానికి ఒక గ్రామం చొప్పున..
జిల్లాలో 23 మండలాలు ఉండగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామం చొప్పన యాసంగి పంట శాటిలైట్ సర్వే నమోదుకు ఎంపిక చేశారు. ఆయా గ్రామాలలో ఏఈఓలతో త్వరలో శాటిలైట్ ద్వారా ప్రత్యేక యాప్‌తో సర్వే చేయనున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సర్వే చేస్తాం
యాసంగి పంటలపై శాటిలైట్ సర్వే చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానిపై ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తాం.
– జి. శ్రీధర్‌రెడ్డి, డీఏఓ
Comments
Please login to add a commentAdd a comment