ఆటోలకు అపరాధం
వేలూరు: కొంత మంది ఆటో డ్రైవర్‌లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులు, రోగుల వద్ద అధికంగా నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేలూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయని ఆటోలు కూడా అధికంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. వీటి వల్ల వేలూరు ఆర్కాడు రోడ్డు, కాట్పాడి రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల మేరకు వేలూరు ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రజని, ట్రాఫిక్ పోలీసులు వేలూరు పాత బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వాహనం నమోదు చేయని ఆటోలు, యూనిఫాం ధరించని, లైసెన్స్‌లు లేని ఆటో డ్రైవర్‌లు, రెన్యువల్ చేయని ఆటోలను తనిఖీ చేశారు. అధికంగా రెన్యువల్ చేయని ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆటోలకు రూ.5 వేల జరిమానా వసూలు చేయడంతో పాటు లైసెన్స్‌లు, యూనిఫాం వంటి వాటితోపాటు ట్రాఫిక్ నిబందనలు పాటించని 200 ఆటోలకు రూ.2 లక్షలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment