కొరుక్కుపేట: ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రిజర్వేషన్ వ్యవధిని 60 రోజుల నుంచి 90 రోజుల ముందుకు మార్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. ఈ విధానపరమైన మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. తమిళనాడులో, సుదూర నగరాలకు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ బస్సులను నడుపుతోంది. పండుగలు, వారాంతాల్లో రైళ్లలో టికెట్ లభ్యత సులభంగా ఉండదు. తత్కాల్‌కు ముందు కూడా క్షణాల్లో టిక్కెట్లు బుక్ అయిపోతాయి దీంతో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా, ప్రైవేట్ ఓమ్నీ బస్సులు వారాంతాలు, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి తదితర పండుగ రోజులలో విమాన టిక్కెట్లతో సమానంగా వసూలు చేస్తాయి. ఆమ్నీ బస్సుల్లో మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల రిజర్వేషన్ వ్యవధిని 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచినట్లు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం నేటి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో పొంగల్ బుకింగ్ ప్రారంభమైంది. దీని ప్రకారం, చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి www.tnrtc.in ను చూడవచ్చునని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment