● నిద్ర లేక జైలులో అవస్థలు
సాక్షి, చైన్నె: బెయిల్ కోసం చైన్నె ఎగ్మూర్ కోర్టులో సినీ నటి కస్తూరి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. పులల్ జైలులో ఆమె నిద్ర లేక, సరిగ్గా ఆహారం తినక అవస్థలు పడుతున్నట్టు అందులో పేర్కొన్నారు. వివరాలు.. తెలుగు వారిని కించపరిచే విధంగాఅనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని పోలీసులు అరెస్టు చేసి ఎగ్మూర్ కోర్టు ఆదేశాలతో రిమాండ్ నిమిత్తం పుళల్ కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. ఆదివారం జైలుకు వెళ్లే ముందుగా ఆమె జ్యూస్ , శాండ్ విజ్ తీసుకున్నారు. ఇతర మహిళా ఖైదీలతో పాటు ఓ గదిలో ఆమెను ఉంచారు. రాత్రంతా జైలులో ఆమె నిద్ర పోకుండా బాధ పడుతున్నట్టు తెలిసింది. సోమవారం జైలులో ఉదయం , మధ్యాహ్నం పొంగలి, కిచ్చెడి వంటి ఆహారం అందజేసినా ఆమె వాటిని కొంత మాత్రమే తీసుకుని మిగిలినవి తినకుండా పడేసినట్టు వెలుగు చూసింది. సినీ సెలబ్రటీ కావడంతో ఆమెకు ఏ 1 సౌకర్యాలతో గది కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆమె దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కస్తూరి ఎగ్మూర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment